Breaking News
Home / States / మృతదేహాలను భద్రపరచండి….

మృతదేహాలను భద్రపరచండి….

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మానవహక్కుల సంఘాలు స్పందిస్తున్నాయి. నిందితులు తమ నుంచి ఆయుధాల్ని గుంజుకొని ఎదురు తిరగడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడాన్ని తప్పుబడుతూ పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు  హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుని విచారించింది. జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచందర్‌రావు బెంచ్‌ ఈ నెల 9వ తేదీ రాత్రి 8 గంటలకు వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా నిందితులు పోస్టుమార్టం వీడియో కాపీలను జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు అందజేయాలని అన్నారు. ఈ కేసును ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు సీజే ఆధ్వర్యంలో డివిజన్‌ బెంచ్‌ విచారిస్తుందని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *