Breaking News
Home / National / శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్ నాథ్ ఇకలేరు…

శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్ నాథ్ ఇకలేరు…

మంగళూరు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్ నాథ్ (69) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన పెద్ద కొడుకు దుబాయ్‌లో పనిచేస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సాయంత్రం మంగళూరుకు తీసుకెళ్లే అవకాశముంది. అనంతరం కద్రి గోపాల్ నాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరపనున్నారు. ఎనిమిదేండ్ల ప్రాయంలో మైసూరులో పర్యటించిన కద్రి గోపాల్‌నాథ్, చిన్న వయస్సు నుంచే శాక్సోఫోన్ వాయిద్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన చనిపోయారని తెలియగానే సంగీత ప్రియులు శోఖసంద్రంలో మునిగిపోయారు. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *