Breaking News
Home / National / భారత్‌లో రెండో కరోనా కేసు..!

భారత్‌లో రెండో కరోనా కేసు..!

తిరువనంతపుం: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను ఇటీవల చైనాలో పర్యటించి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో రెండు కరోనా కేసులు నమోదు కాగా రెండూ కూడా కేరళలోనే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైంది. మరణించిన వ్యక్తి వుహాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.

చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం
అయితే ఈ వైరస్‌ రోజు రోజుకు దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది. చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా.. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *