Breaking News
Home / Sports / పుజారా ఔట్‌.. మయాంక్‌ అర్ధ శతకం

పుజారా ఔట్‌.. మయాంక్‌ అర్ధ శతకం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. కివీస్‌ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటూ క్రీజులో పాతుకు పోతున్న పుజారా(11; 81 బంతుల్లో) ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టీ విరామానికి ముందు వేసిన 32వ ఓవర్‌ చివరి బంతికి పుజారా క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో బౌల్ట్‌ మూడో రోజు కివీస్‌కు రెండో బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 78/2గా నమోదైంది. పుజారా, మయాంక్‌ అగర్వాల్‌(52; 81 బంతుల్లో 6×4, 1×6) రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. టీమ్‌ఇండియా ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది. కోహ్లీ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *