పూణె : పూణె వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. వెలుతురు సరిగాలేని కారణంగా నాలుగు ఓవర్లు ముందే ఆటను ముగించారు. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ తొలి ఇన్నింగ్స్ లో 273/3. భారత్ బ్యాట్స్ మెన్లలో మయాంక్ అగర్వాల్ 108, చటేశ్వర్ పుజారా 58 పరుగులు చేయగా క్రీజులో కోహ్లీ 63, రహానే 18 పరుగులతో ఉన్నారు.
