Breaking News
Home / States / Andhra Pradesh / విజయవాడలో ఈ విచిత్రాన్ని చూడండి !

విజయవాడలో ఈ విచిత్రాన్ని చూడండి !

కటౌట్‌ చూసి నమ్మొద్దు డ్యూడ్‌
విజయవాడ: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మాయ చేస్తాయి. ఈ వి‘చిత్రం’ అలాంటిదే. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ఆ పక్కనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కటౌట్‌లు. గన్నవరంలో జాతీయ రహదారి పక్కన కనిపించిన ఈ దృశ్యం అటుగా వెళ్లేవారిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం, ఆ పక్కనే ప్రతిపక్ష నేతల కటౌట్లు చూసి అసలేం జరుగుతుంది..! అని చెవులు కొరుక్కున్న వారు చాలామందే. తదేకంగా చూస్తే గానీ, తెలియలేదు. అవి ఓ ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ సంస్థ తమ వ్యాపార ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని.. ఇది చూసి కంగుతిన్న వారు.. ‘ఎక్కడైనా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి కటౌట్‌లు కట్టించుకుంటాయా.. విడ్డూరం కాకపోతే..’ అని నిట్టూర్చారు.

Check Also

పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Share this on WhatsAppహైదరాబాద్: పిల్లల్ని అపహరించి.. డబ్బుల్లేని వారికి పిల్లలను అమ్మడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *