Breaking News
Home / Crime / ‘దృశ్యం’ సినిమా చూసి ఎంత పనిచేశారో చూడండి!

‘దృశ్యం’ సినిమా చూసి ఎంత పనిచేశారో చూడండి!

హిందీలో ద్రిశ్యం, తెలుగులో దృశ్యం. పేరు వేరైనప్పటికీ కథ ఒకటే. 2015లో అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో విడుదలైన ‘ద్రిశ్యం’ సినిమాను చూసిన ఓ బీజేపీ నేత అదే తరహాలో ఓ 22 ఏళ్ల మహిళను హత్య చేశాడు. రెండేళ్లుగా ఈ నిజాన్ని సమాధి చేయాలని చూశాడు. కానీ పోలీసులు అతని గుట్టును రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన ట్వింకిల్ దాగ్రే(22) అనే మహిళ రెండేళ్ల క్రితం అదృశ్యమైంది. కానీ.. ఈ కేసును విచారించిన పోలీసులకు ఆమెది హత్యగా తేలింది. ఈ హత్య చేసింది బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీష్ కరసియా, అతని ముగ్గురు కొడుకులని తెలిసింది.

ద్రిశ్యం సినిమా చూసి హత్య చేసినట్లు నిందితులే స్వయంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్లుగా మిస్టరీగా మారిన ఈ కేసు గుట్టు శనివారం సాయంత్రం ఎట్టకేలకు వీడింది. బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీష్ కరోటియా(65)కు, ట్వింకిల్ దాగ్రేకు వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ వివాహేతర సంబంధం విషయంలో జగదీష్ కరోటియాకు, అతని ముగ్గురు కొడుకులకు మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి కొడుకులతో కలిసి జగదీష్ ట్వింకిల్ హత్యకు ప్లాన్ చేశాడు.

జగదీష్(65), అతని కొడుకులు అజయ్(36), విజయ్(38), వినయ్(31) అందరూ కలిసి ద్రిశ్యం సినిమా చూశారు. ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్‌ను ఆదర్శంగా తీసుకుని ట్వింకిల్‌ను హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని కాల్చివేశారు. ఓ ప్రదేశంలో ఓ కుక్కను చంపేసి పూడ్చి పెట్టారు. ఎవరో మనిషిని పూడ్చిపెట్టారనే పుకారు సృష్టించారు. పోలీసులు జాగిలాలతో వెళ్లగా ఓ దగ్గర వాసన పసిగట్టాయి. అక్కడ తవ్వగా.. వీళ్లు పూడ్చి పెట్టిన కుక్క కళేబరం కనిపించింది. కేసును ఇలా రెండేళ్ల పాటు పక్కదోవ పట్టించారు. కానీ ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఖననం చేసిన దగ్గర ట్వింకిల్ బ్రాసిలైట్, ఆభరణాల దొరికాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

Check Also

మోస్ట్‌వాంటెడ్ నీరవ్‌ మోదీ లండన్‌లో ఉద్యోగి అట…అతని నెల జీతం 20వేల పౌండ్లు

Share this on WhatsAppలండన్ లాయర్ కోర్టులో వెల్లడి లండన్ : వేల కోట్ల రూపాయల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *