Breaking News
Home / Sports / ఆట‌గాళ్లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ, యువ‌రాజ్…..?

ఆట‌గాళ్లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ, యువ‌రాజ్…..?

టీమిండియా డాషింగ్ క్రికెట‌ర్‌ యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశంలో త‌న నిర్ణ‌యాన్ని ప్రకటించాడు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పాడు. యువ‌రాజ్‌తో క‌లిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడిన డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్.. యువీ రిటైర్మెంట్ గురించి ట్విట‌ర్ ద్వారా స్పందించాడు.

`ఆట‌గాళ్లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ, యువ‌రాజ్ లాంటి ఆట‌గాళ్లు చాలా అరుదు. యువీ ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాడు. భ‌యంక‌ర‌మైన వ్యాధిపై, మైదానంలో బౌల‌ర్ల‌పై సునాయాసంగా పైచేయి సాధించాడు. అంద‌రి హృద‌యాల‌నూ గెల్చుకున్నాడు. పోరాట ప‌టిమ‌, ప‌ట్టుద‌ల‌తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన యువీకి శుభాకాంక్ష‌లు` అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. యువీతో క‌లిసి ఉన్న త‌న ఫోటోను కూడా షేర్ చేశాడు.

Check Also

ఇంగ్లండ్‌ కీలక క్రికెటర్స్ పలు మ్యాచ్ లకు దూరం

Share this on WhatsAppమాంచెస్టర్‌: శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తొడ కండరాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *