తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో ఉన్న అటవీశాఖ బేస్ క్యాంపు వద్ద రెండు వేల ఆరు వందల కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు డెబ్భై ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. విశాఖ జిల్లా సీలేరు నుండి మహారాష్ట్రకు వ్యాన్ ద్వారా గంజాయిని తరలిస్తున్నారని, గంజాయిని తీసుకువెళ్తున్న వ్యక్తులు తులుగోండ బేస్ క్యాంపు వద్ద వ్యాన్ ను వదిలి పారిపోయారని తెలిపారు. వ్యాన్ తనిఖీలో దొరికిన ఆధార్ కార్డ్ ల ప్రకారం.. ఒకరు తెలంగాణా రాష్ట్రంలోని ఇల్లందు కు చెందిన బాలకృష్ణ, మహారాష్ట్ర కు చెందిన అజాబ్ గులార్ షేక్ లు గా ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించామన్నారు. వీరికోసం గాలింపు చేపట్టామన్నారు. వ్యాన్ లో దొరికిన గంజాయిని స్వాధీనం చేసుకొని, వ్యాన్ ను సీజ్ చేశామని తెలిపారు. .
