Breaking News
Home / States / ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

జగిత్యాల: జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోతే గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్నాడు. ఓటు వేస్తూ మొబైల్‌తో సెల్ఫీ ఫొటో తీసుకోవడంతో దీన్ని గమనించిన పోలింగ్ ఆఫీసర్ భీంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణలో మోహన్ సెల్ఫీ తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి మోహన్‌కు రూ.4,200 జరిమానా విధించినట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *