Breaking News
Home / National / రక్తం అమ్మి…మద్యం తాగిన యువకుడి మృతి

రక్తం అమ్మి…మద్యం తాగిన యువకుడి మృతి

అలీఘడ్ : ఆసుపత్రిలో రక్తం అమ్మి… పీకల దాకా మద్యం తాగిన ఓ యువకుడు నైట్ షెల్టరులో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. అలీఘడ్ నగరానికి చెందిన జగదీష్ అనే యువకుడు రెయిన్ బసేరా ప్రాంతంలోని మున్సిపల్ కార్పొరేషన్ నైట్ షెల్టరులో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జగదీష్ రాత్రి నైట్ షెల్టరుకు వచ్చి పడుకొని ఉదయంకల్లా శవమయ్యాడు. జగదీష్ ఆసుపత్రిలో రక్తం అమ్మి, మద్యం తాగి వచ్చాడని నైట్ షెల్టరుకు చెందిన చాంద్ ముహమ్మద్ చెప్పాడు. జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదికలో జగదీష్ మృతికి కారణం తెలుస్తుందని అలీఘడ్ మున్సిపాలిటీ పీఆర్వో సభాపతియాదవ్ చెప్పారు.

Check Also

కాంగ్రెస్ నీరసించిపోలేదు…

Share this on WhatsAppముంబై : కీలకమైన అసెంబ్లీ ఎన్నికల యుద్ధం నుంచి కాంగ్రెస్ పారిపోయిందన్న విమర్శలపై ఆ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *