Breaking News
Home / National / పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

న్యూఢిల్లీ: పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశారు. గత జూన్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా సిద్ధూకు విద్యుత్ శాఖ మంత్రి పదవిని అప్పగించారు. దీనిపై కొద్దికాలంగా సిద్ధూ అసంతృప్తిగా ఉండటమే కాకుండా ఇంతవరకూ పదవీ బాధ్యతలు కూడా చేపట్టలేదు. కాగా, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తన రాజీనామా విషయాన్ని పంచుకున్నట్టు సిద్ధూ ఇవాళ ఓ ట్వీట్‌లో షేర్ చేశారు. రాహుల్‌ గాంధీకి 2019 జూన్ 10న తన రాజీనామా లేఖను అందజేశానని ఆయన పేర్కొన్నారు.

సిద్ధూ తన రాజీనామా లేఖను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు కాకుండా నేరుగా రాహుల్ గాంధీకి ఇచ్చారు. అయితే తన రాజీనామా విషయాన్నిట్వీట్ చేసిన 30 నిమిషాల తర్వాత సిద్ధూ మరో ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రికి కూడా తన రాజీనామా లేఖను పంపుతున్నట్టు చెప్పారు. అయితే, గత నెలరోజులుగా ఆయన తన రాజీనామాను సీఎంకు ఎందుకు పంపలేదనే విషయం స్పష్టం కాలేదు.

సిద్ధూ, అమరీందర్ మధ్య కొద్దికాలంగా సత్సంబంధాలు లేవు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి సిద్ధూ వెళ్లడం, పాక్ ఆర్మీ చీఫ్‌ను హగ్ చేసుకోవడం వంటివి అమరీందర్‌ను ఇరకాటంలో పెట్టాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తన భార్యకు ఛండీగఢ్ నుంచి కానీ అమృత్‌సర్ నుంచి కానీ టిక్కెట్ రాకుండా అమరీందర్ అడ్డుకున్నారని కూడా సిద్ధూ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూ శాఖ మార్పు ఆయనను మరింత అసంతృప్తికి గురిచేసింది. ఈ క్రమంలోనే సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *