Breaking News
Home / States / Andhra Pradesh / కీలక నేత హత్యపై వర్ల సంచలన ఆరోపణలు….

కీలక నేత హత్యపై వర్ల సంచలన ఆరోపణలు….

గుంటూరు: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విషయమై సోమవారం గుంటూరులో మీడియాతో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ కేసును తారుమారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చూపబోతున్నారని, ముద్దాయిలు ఎవరో సీఎం జగన్‌కు తెలుసునని, అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదని తెలిపారు. వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు తెలుసునని చెప్పారు. పోలీసులు తమ నీతి నిజాయితీ చూపించుకునే కేసు ఇదని వ్యాఖ్యానిస్తూ ఈ కేసులో డీజీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కీలక నేత హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. కేసు గురించి తెలుసుకునే హక్కు ఒక పౌరుడిగా తనకు ఉందని, కేసును మసిపూసి మారేడు కాయ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *