Breaking News
Home / Crime / బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు….

బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు….

ఫెని(బంగ్లాదేశ్‌) : నుస్రత్‌ జహాత్‌ రఫీ అనే విద్యార్థిని ఓ శిక్షణ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి ప్రధాన అధ్యాపాకుడు ఆమెను లైంగిక వేధించడంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీచర్‌ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా రఫీపై బెదిరింపులకు పాల్పడ్డాడు. రఫీ వినకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన మరికొంత మందితో కలిసి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న నుస్రత్‌ను హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 10వ తేదీన కన్నుమూసింది.

నుస్రత్‌ మృతిపై దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆమె మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా బాధ్యులను తప్పకుండా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా 18 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులు తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ రఫీ బిల్డింగ్‌ పై నుంచి కాలిపోతూ కింది పడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో నుస్రత్‌ క్లాస్‌మేట్స్‌ కూడా ఉన్నారు. గురువారం ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్‌ కోర్టు 62 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి 16 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *