Breaking News
Home / Lifestyle / Business / 1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ఎనిమిది రోజులుగా దిగువ చూపే
వారంలో 1500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
11300 దిగువన నిఫ్టీ
ముంబై: చైనా వస్తువులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటన శుక్రవారం కూడా స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపింది. మార్కెట్‌ నష్టాల బాటలో నడవడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. నిఫ్టీ కీలకమైన 11300 కన్నా దిగజారింది. ఉదయం నుంచి భారీగా సాగిన అమ్మకాల కారణంగా మార్కెట్‌ రో జంతా తీవ్ర ఆటుపోట్లు చవి చూసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిరాశావహంగా ఉండ డం, దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాల్లో ఏ మాత్రం ఉత్సాహం కనిపించకపోవడం వల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికా, చైనా వాణిజ్య పోరాటానికి కాలు దువ్వుతున్నప్పటికీ ఇప్పటికీ ఉభయులూ చర్చల ప్రక్రియ కొనసాగిస్తూ ఉండడంతో వారి మధ్య రాజీ కుదరకపోతుందా అనే ఆశలు ఉండడమే మార్కెట్‌కు కొంత ఊరటని పరిశీలకులంటున్నారు. ఆటోమొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ప్రైవేటు బ్యాంకుల ఫలితాలు నిరాశావహంగానే ఉండడం, ఆర్థిక రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వంటి పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ జర్బాదే అన్నారు.

టాటా స్టీల్‌ 6 శాతం పతనం

జర్మనీకి చెందిన తైసెన్‌క్రుప్‌ యూరోపియన్‌ వ్యాపారాలను టాటా స్టీల్‌లో విలీనం చేసే ప్రతిపాదనను యూరోపియన్‌ కమిషన్‌ బ్లాక్‌ చేయవచ్చనే వార్తలతో టాటా స్టీల్‌ షేరు 6.10 శాతం పతనమైంది. సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన షేర్లలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. ఇంట్రాడేలో ఈ షేరు 7.55 శాతం క్షీణించి రూ.479.75 వరకు దిగజారినా చివరికి రూ.487.30 వద్ద ముగిసింది.

  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫలితాలు నిరాశపరచడంతో ఆ షేరు 4.5 శాతం మేరకు నష్టపోయింది. బీఎ్‌సఈలో 4.07 శాతం నష్టంతో రూ.1086.05 వద్ద ముగిసింది.
  • నష్టపోయిన ఇతర షేర్లలో యెస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, వేదాంతా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, హీరోమోటోకార్ప్‌ నష్టాల్లోనే ముగిశాయి.
    పీఎన్‌బీ హౌసింగ్‌ 13 శాతం లాభం
    ప్రోత్సాహకమైన ఆర్థిక ఫలితాల కారణంగా పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు 13 శాతం లాభపడింది. బీఎ్‌సఈలో ఈ షేరు 12.08 శాతం లాభపడి రూ.782.35 వద్ద ముగిసింది.
    లాభపడిన షేర్లలో భారతి ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, మహీంద్రా, టాటా మోటార్స్‌ ఉన్నాయి.
    సూచీల పతనం తీరిదే…
    తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 95.92 పాయింట్ల మేరకు దిగజారి 37462.99 వద్ద ముగియగా నిఫ్టీ 22.90 పాయింట్లు దిగజారి 11278.90 వద్ద క్లోజయింది. వారం మొత్తం మీద ఈ కీలక సూచీలు రెండూ భారీ క్షీణతను చవి చూశాయి. సెన్సెక్స్‌ భారీ స్థాయిలో 1500 పాయింట్లు దిగజారగా నిఫ్టీ 433.35 పాయింట్లు క్షీణించింది.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *