Breaking News
Home / Lifestyle / Business / మరోసారి ఢమాలన్న స్టాక్‌మార్కెట్లు

మరోసారి ఢమాలన్న స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల బాట పట్టాయి. ఊగిసలాట మధ్య నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో కోలుకున్నప్పటికీ దాదాదాపు 370 పాయింట్లకుపైగా పతనమైంది. ప్రపంచ ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 357 పాయింట్లు క్షీణించి 35,533 కు చేరగా నిఫ్టీ 118 పాయింట్లు బలహీనపడి 10673 వద్ద ట్రేడవుతోంది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలూ వెనకడుగులో ఉన్నాయి. ప్రధానంగా మెటల్‌, మీడియా, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ భారీగా నష్టపోతున్నాయి.

ఐషర్‌, హెచ్‌పీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, బీపీసీఎల్‌, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, మారుతీ స్వల్ప లాభాలతో ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినప్పటికీ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఆదాయం క్షీణించనున్న అంచనాలు ప్రకటించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అటు డాలరు మారకంలో రుపీ బలహీనత కొనసాగుతోంది. ప్రస్తుం 70.26 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Check Also

కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ భారీ షాక్

Share this on WhatsAppన్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రాకు భారతీయ రిజర్వు బ్యాంకు భారీ షాకిచ్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *