Breaking News
Home / Lifestyle / Business / 324 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

324 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

వాణిజ్య ఉద్రిక్తతలతో సెంటిమెంట్‌ బలహీనం
324 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
ముంబై : వరుసగా రెండో రోజున కూడా వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్‌ను అల్లాడిపోయేలా చేశాయి. గత వారంలో మూడు రోజుల నష్టాలను కూడా కలిపితే మొత్తం ఐదు రోజులుగా మార్కెట్‌ నష్టాల్లోనే ట్రేడవు తోంది. ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత దేశీయ మార్కెట్‌ ఇంత సుదీర్ఘ సమయం పాటు నష్టాల్లో ట్రేడ్‌ కావడం ఇదే ప్రథమం. చైనా వస్తువులపై సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరిక నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ రగులుకోవడం, దేశీయంగా కార్పొరేట్‌ కంపెనీలు ప్రకటించిన నిరాశా పూరితమైన ఫలితాలు మంగళవారం మార్కెట్‌ సెంటి మెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్త తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీరని ముప్పు అంటూ ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ చేసిన వ్యాఖ్యతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు తెగబడ్డారు.

మరోపక్క జపాన్‌, కొరియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం, యూరోపియన్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతూ ఉండడంతో ఇక భారత మార్కెట్‌ ఏ దశలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల పరిధిలో ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 323.71 పాయింట్ల నష్టంతో 38276.63 వద్ద నిఫ్టీ 100.35 పాయింట్ల నష్టంతో 11497.90 వద్ద ముగిశాయి. అమెరి కా, చైనా వాణిజ్య చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభనతో గత రెండు రోజులుగా మార్కెట్‌ భారీ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నదని, కార్పొరేట్‌ ఫలితాల్లో బలహీనత కూడా జోడు కావడంతో ఇక కోలుకోలేని స్థితికి చేరిందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పరిశోధన విభాగం హెడ్‌ జగన్నాధం తునుగుంట్ల అన్నారు.

దెబ్బ తీసింది ఆ నాలుగు షేర్లే…
టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు 4.60 శాతం మేరకు క్షీణించి సెన్సెక్స్‌ పతనంలో ప్రధాన పాత్ర పోషించాయి. బీఎస్‌ఈ లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3.77 శాతం దిగజారి రూ.386.25 వద్ద క్లోజ్‌ కాగా భారతి ఎయిర్‌టెల్‌ షేరు 3.10 శాతం పతనమై రూ.323.05 వద్ద ముగిసింది.

కాగా హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో మాత్రం లాభాల్లో ముగిశాయి.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *