Breaking News
Home / National / లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌…

లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌…

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్‌ 120 పాయింట్ల లాభంతో 39,179 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,634 వద్ద ట్రేడవుతున్నాయి. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు మార్కెట్లో జోరును నింపాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 4శాతం లాభపడగా భారతీ ఎయిర్‌టెల్‌ 2శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 0.2శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.4శాతం లాభాల్లో ఉన్నాయి.

నేడు ఐటీసీ, మారుతీసుజుకీ, బంధన్‌ బ్యాంక్‌, ఇండిగో మరో 87 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లలో కొంత అస్థిరత కనిపించింది. బ్రెగ్జిట్‌పై కొన్ని ఈయూ సభ్యదేశాలు తమ నిర్ణయాల్ని ఆలస్యం చేస్తుండటం దీనికి కారణంగా ఉంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *