Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ కేబినెట్ లోని పలు కీలక నిర్ణయాలు….

ఏపీ కేబినెట్ లోని పలు కీలక నిర్ణయాలు….

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గం చర్చలు జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ. 24 వేలు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కార్పొరేషన్‌ ఏర్పాటు, జిల్లాల వారీగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు, హోంగార్డుల జీతాల పెంపునకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

టీడీపీ పదేపదే అనవసర ఆరోపణలు చేస్తోందని కేబినెట్‌లో ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తోందని పలువురు మంత్రులు సీఎంకు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం అంశాలవారీగా టీడీపీకి, చంద్రబాబుకు కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్తే సరిచేయాలన్నారు. వరద కారణంగా ఇసుక కొరత ఉందని త్వరలో పరిష్కారం అవుతుందని అధికారులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *