Breaking News
Home / States / Andhra Pradesh / రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ వారి సన్నిధి ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేయనున్నారు. మూడు రోజుల పాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం లభించనుంది. రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. మరోవైపు అమ్మవారి ఆలయంలో కేశఖండన శాల ప్రారంభమైంది. గంటకు 90 టికెట్లను అధికారులు విక్రయిస్తున్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *