Breaking News
Home / Film News / జమున తల షేక్ కి కారణం ఆ హీరో నా….

జమున తల షేక్ కి కారణం ఆ హీరో నా….

పాత తరం హీరోయిన్లు ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సావిత్రి, జమున. అప్పట్లో జమున ఏ హీరో తో అయినా చాలా డామినేషన్ గానే నటించేవారని అంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ..తన జీవితంలో ఒక భయంకర సంఘటనలో అదే..తనకి హెడ్ షేక్ రావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. తనకు ఎవీఎం సంస్థతో ఎంతో అనుబంధం ఉందని..ఆ సంస్థ తనకు మాతృసంస్థలాంటిదని అన్నారు. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించానని అన్నారు. ఆ బ్యానర్లో నేను 14 సినిమాల వరకూ చేశానని అన్నారు.

తెలుగులోని ‘లేత మనసులు’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాను రిమేక్ చేశారు..అందులో కూడా నేనే నటించాను. ఆ రోజున ‘అందాల ఓ చిలుక .. ‘ పాటను తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో హరినాథ్ కి బదులుగా తమిళ హీరో జయశంకర్ ని తీసుకున్నారు. ‘అందాల ఓ చిలుక .. ‘ పాట చిత్రీకరిస్తున్న సమయంలో గడ్డివాము నుంచి జారి నా ఒళ్లో వాలిపోయే సిన్..అంతకు ముందు బాగానే ప్రాక్టీస్ చేశారు.

తీరా టేక్ సమయంలో ఒక్కసారే నా తలమీద పడిపోయారు..ఆయన కాళ్లు బలంగా తాకాయి. అప్పుడు కాస్త తలనొప్పి అనిపించింది..కానీ కొద్ది రోజుల తర్వాత తల వణికిపోవడం మొదలైంది. అప్పటి నుంచి నా తల షేక్ కావడం మొదలైంది అని వాపోయారు

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *