Breaking News
Home / Lifestyle / Business / షామీ సంస్థ అభిమానికి షాక్ ఇచ్చిన కంపెనీ ఎండీ….

షామీ సంస్థ అభిమానికి షాక్ ఇచ్చిన కంపెనీ ఎండీ….

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షామీ ఇండియా కంపెనీ ఎండీ డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. యుగంధర్‌ రెడ్డి అనే షామీ సంస్థ అభిమానికి ఆయన ఫోన్‌ను స్వయంగా డెలివరీ చేశారు. ఈ విషయంపై షామీ ఎండీ మను కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ ” కొత్త ఫోన్లను విడుదల చేసిన ప్రతిసారీ కొన్ని నేనే స్వయంగా వెళ్లి వినియోగదారులకు అందజేస్తాను. ఈ సందర్భంగా వారి ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎంఐ అభిమానుల కుటుంబాన్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది” అని ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవల యుగంధర్‌ రెడ్డి రెడ్‌మీ నోట్‌ 8ప్రో ఫోన్‌ను ఆర్డర్‌ చేశారు. ఆయన ఇప్పటికే చాలా ఎంఐ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఆయన కుటుంబంలో పోకో ఎఫ్‌1, రెడ్‌మీ నోట్‌ 7 ప్రో, ఎంఐ ఏ3 వినియోగిస్తున్నారు.

షామీ సంస్థ ఆన్‌లైన్‌లో ఫోన్ల విక్రయానికి ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి పోర్టళ్లతోపాటు సొంత పోర్టల్‌ ఎంఐ.కామ్‌లో కూడా విక్రయాలు జరుపుతోంది. 2020 సంవత్సరం మధ్యనాటికి భారత్‌లో దాదాపు 10వేల స్టోర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ 6,000 స్టోర్లను ఏర్పాటు చేసింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *