Breaking News
Home / National / రాజ్‌నాథ్ ఆయుధ పూజపై ఎన్సీపీ విమర్శలు…

రాజ్‌నాథ్ ఆయుధ పూజపై ఎన్సీపీ విమర్శలు…

ముంబై: విజయ దశమి సందర్భంగా రఫెల్ యుద్ధ విమానానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ దేశ భద్రత దృష్ట్యా తీసుకునే నిర్ణయాల పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అయితే ఓ మాట చెప్పాలనుకుంటున్నానంటూ చెడు దృష్టి నుంచి రక్షణగా రఫెల్ యుద్ధ విమానానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం కొత్త ట్రక్కుకు వేలాడదీసినట్టుగా ఉందంటూ విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఇలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. తమాషాలొద్దని బోఫోర్స్ లాంటి ఆయుధాలను కొన్నప్పుడు తామెలాంటి షో చేయలేదని వ్యాఖ్యానించారు.

ఈ నెల 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో శరద్ పవార్ జోరుగా పాల్గొంటున్నారు. 78 ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం అలసట లేకుండా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ – శివసేన కూటమిని ఓడించడమే తన లక్ష్యమని ఆయన అంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *