Breaking News
Home / Film News / 400వ సినిమా చేస్తున్న షావుకారు జానకి

400వ సినిమా చేస్తున్న షావుకారు జానకి

‘పార్తా జ్ఞాపకం ఇల్లయే..’ అనే పాట వినగానే తమిళ ప్రేక్షకులకు అలనాటితార షావుకారు జానకినే గుర్తుకొస్తారు. వయసు పైబడడంతో సినిమాలు తగ్గించినా అప్పుడప్పుడూ ఒకటి రెండు చిత్రాల్లో తనకే సొంతమైన నటనతో ఈ తరం ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు. తాజాగా ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో సంతానం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో షావుకారుజానకి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆమె నటిస్తున్న 400వ సినిమా అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో షావుకారు జానకి కూడా హాస్యం పండిస్తున్నారని, ఆమె నటన, ఈ వయసులోనూ ఆమె చూపే అంకితభావం తనను భ్రమింపజేశాయని దర్శకుడు ఆర్‌.కన్నన్‌ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న షావుకారు జానకి ఈ చిత్రంతో ఈ తరం ప్రేక్షకుల్ని అలరించబోతున్నారని ఆయన చెప్పారు. కాగా, ఈ చిత్రం 2020 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *