Breaking News
Home / Sports / పాకిస్థాన్ క్రికెటర్లపై మండిపడ్డ శిఖర్ ధవన్

పాకిస్థాన్ క్రికెటర్లపై మండిపడ్డ శిఖర్ ధవన్

టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ మరోసారి పాకిస్థాన్ క్రికెటర్లపై మండిపడ్డాడు. ఇరు దేశాల మధ్య ఉన్న దైపాక్షిక సంబంధాల గురించి ఇటీవల ఓ టీవీ షోలో అతను కామెంట్ చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్లు ముందు తమ ఇంటిని బాగు చేసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలి అని అతను పేర్కొన్నాడు.

‘‘ఎవరైన మన దేశం గురించి మాట్లాడితే.. కచ్చితంగా మనం అందుకు మద్దతివ్వాలి. బయట వాళ్లు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు మీ దేశాన్ని అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత పక్క వాళ్ల గురించి మాట్లాడాలి. ఎవరైతే గాజు ఇంట్లో ఉంటారో వాళ్లు.. పక్కన వాళ్ల ఇంటిపై రాళ్లు వేసే ప్రయత్నం చేయొద్దు’’ అని ధవన్ పేర్కొన్నాడు.

గతంలో కూడా ధవన్.. పాకిస్థాన్ క్రికెటర్లపై విమర్శలు చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ కశ్మీర్ గురించి కామెంట్ చేస్తే.. పక్క దేశం వాళ్లు కశ్మీర్ గురించి మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ధవన్ అన్నాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *