Breaking News
Home / Sports / ప్రపంచ కప్ నుంచి శిఖర్ ధవన్ వైదొలగనున్నాడు…?

ప్రపంచ కప్ నుంచి శిఖర్ ధవన్ వైదొలగనున్నాడు…?

న్యూఢిల్లీ: బొటనవేలు గాయం కారణంగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ మూడు వారాల పాటు ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు. ఆదివారం ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఎడమ చేతి బొటనవేలుకు బంతి బలంగా తగిలింది. చేతికి గాయమైనప్పటికీ క్రీజులో నుంచి బయటికి రాకుండా బ్యాటింగ్ చేసిన ధవన్.. ఆస్ట్రేలియాపై 117 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సోమవారం స్కానింగ్ చేయడంతో వేలు ఎముక చిట్లినట్టు తేలింది.

గాయం కారణంగా వచ్చే మూడు వారాల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై జరిగే మ్యాచ్‌లలో శిఖర్ ధవన్ ఆడే అవకాశం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ జూన్‌లోనే జరగనున్నాయి. శిఖర్ ధవన్ స్థానంలో కేఎల్ రాహుల్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కేఎల్ రాహుల్‌తో పాటు శ్రియాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల పేర్లు కూడా పరిశీలించనున్నట్టు టీమిండియా వర్గాలు వెల్లడించాయి.

Check Also

స్మృతిని వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్…

Share this on WhatsAppదుబాయ్: ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన అగ్రస్థానాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *