Breaking News
Home / Film News / బాబాకు బంగారు కిరీటం బహుకరించిన ‘సాగర‌ కన్య’

బాబాకు బంగారు కిరీటం బహుకరించిన ‘సాగర‌ కన్య’

బాలీవుడ్‌నటి శిల్పాశెట్టి, తన భర్త రాజ్‌కుంద్రాతో పాటు షిర్డీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బాబాకు భక్తితో బంగారు కిరీటం సమర్పించుకున్నారు. బాబాపై శిల్పాశెట్టి భక్తప్రపత్తులను చాటుకుంటుంటారు. ప్రతీయేటా బాబాను దర్శించుకునేందుకు షిర్డీ వస్తుంటారు. ఆమె బాబాను దర్శించుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. కాగా శిల్పాశెట్టి…సాయిబాబాకు బహూకరించిన కిరీటం బరువు 800 గ్రాములు ఉంది. దీని ధర రూ. 25 లక్షలు. బంగారంతో అందంగా రూపొందించిన ఈ కిరీటంలో రత్నాలను కూడా వినియోగించారు. షిర్టీ వచ్చిన శిల్పా కుటుంబ సభ్యులు గంటపాటు ఇక్కడే ఉన్నారు. శిల్పాశెట్టి తెలుగులో హీరో వెంకటేష్ సరసన ‘సాహస వీరుడు, సాగరకన్య’ చిత్రంలో నటించారు.

Check Also

మేము పెళ్లి చేసుకోబోతున్నాం: ప్రకటించిన ప్రేమజంట

Share this on WhatsAppమార్చిలో పెళ్లి చేసుకోవోతున్నామంటూ మరో ప్రేమ జంట అధికారికంగా ప్రకటించేసింది. ఆర్య, సాయేషా ప్రేమ వ్యవహారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *