Breaking News
Home / National / హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న షియోమీ టీవీలు!

హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న షియోమీ టీవీలు!

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఎంఐ డాట్ కామ్‌లలో జరుగుతున్న ఫెస్టివ్ సేల్‌లో చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ఎంఐ టీవీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా ఎంఐ టీవీలను విక్రయించినట్టు షియోమీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా ప్రతీ నిమిషానికి 43 ఎంఐ టీవీలను విక్రయించినట్టు పేర్కొంది. ఈ స్థాయిలో అమ్ముడు పోవడం కంపెనీకి ఇదో మైలురాయిలాంటిందని వివరించింది. గతంలో షియోమీకి చెందిన ఎంఐ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోగా, ఈసారి ఆ సంస్థకు చెందిన టీవీలు పెద్దమొత్తంలో అమ్ముడుపోవడం గమనార్హం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *