Breaking News
Home / Featured / శివసేన సీఎం అభ్యర్థి ఆదిత్య థాక్రే!

శివసేన సీఎం అభ్యర్థి ఆదిత్య థాక్రే!

ముంబై: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన మరోసారి ఒంటరిపోరుకు సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, అసెంబ్లీ ఎన్నికల ముంగిట వివాదాల్లోకి తలదూర్చుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసిన ఈ రెండు మిత్ర పక్షాలు.. అనంతరం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో వచ్చిన బేధాభిప్రాయాలు, సీఎం సీటుపై ఇరు పార్టీల వైఖరితో విడిగా పోటీ చేయాల్సి వచ్చింది.

కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇవే అంశాలు ముందుకు వస్తున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కుమారుడే సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికే బీజేపీ హామీ ఇచ్చిందని, అయితే థాక్రే కుటుంబం అధినేతగా ఉండేందుకే ఇష్టపడతారని సంజయ్ రౌత్ అన్నారు.

‘‘థాక్రే డిప్యూటీ అయ్యేందుకు ఇష్టపడరు. ఆ కుటుంబానికి చెందిన వారెవరైనా అధినేతగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో థాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య థాక్రే ఎన్నికల బరిలో నిలవాలా లేదా అన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రేదే తుది నిర్ణయం’’ అని సంజయ్ రౌత్ అన్నారు. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉంటేనే విమర్శలు గుప్పించడం శివసేనకు అలవాటే. గత ఐదేళ్లుగా శివసేన నేతలు బీజేపీపై అనేకసార్లు విమర్శలు చేశారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *