Breaking News
Home / National / ముగిసిన శివసేన ఉన్నతస్థాయి సమావేశం..

ముగిసిన శివసేన ఉన్నతస్థాయి సమావేశం..

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న శివసేన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది. శివసేన నేతలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో మధ్యాహ్నం గవర్నర్‌తో మరోసారి భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని శివసేన గవర్నర్‌ను కోరనున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం శివసేనకు లేకపోవడంతో వారు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కానీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. కాంగ్రెస్‌తో చర్చించాకే తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపారు. దీంతో సందిగ్దంలో పడిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *