Breaking News
Home / National / ప్రభుత్వం ఏర్పాటుకు శివసేనకు ఆహ్వానం..

ప్రభుత్వం ఏర్పాటుకు శివసేనకు ఆహ్వానం..

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్వారి శివసేన పార్టీని ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ బలాన్ని, సుముఖతను తెలపాల్సిందిగా శివసేనను కోరారు. రేపు రాత్రి 7.30 గంటల లోపు తమ నిర్ణయం తెలపాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.

Check Also

ఐదో వికెట్ కోల్పోయిన భారత్…

Share this on WhatsAppఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 303 బంతుల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *