ముంబయి: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ స్పందిస్తూ ‘ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇరు పార్టీలది 50-50 పాత్ర అని ముందుగానే చెప్పాం. ఇది కచ్చితంగా బీజేపీ-శివసేన ప్రభుత్వం అవుతుంది. దీనిపై రెండో అభిప్రాయం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము ఉద్దవ్‌తో మాట్లాడతామన్నారు. 2014 ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేసి 63 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు 64 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
2014 ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లను గెలుచుకొంది. ఈ సారి ఎన్నికల ముందు శివసేనతో పొత్తు పెట్టుకోవద్దంటూ కొందరు బీజేపీ నేతలు పట్టుబట్టారు. కానీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూటమి ఏర్పాటుకే మొగ్గుచూపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమర్థించడంతో పొత్తు సాధ్యమైదన్న విషయాన్ని రౌత్ గుర్తు చేశారు.