మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. శాసనసభ ఫర్నీచర్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్ మంగళగిరి న్యాయస్థానానికి వచ్చారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
