Breaking News
Home / Politics / బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆరా తీసిన శివరాజ్ సింగ్

బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆరా తీసిన శివరాజ్ సింగ్

హైదరాబాద్: నేడు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సభ్యత్వ నమోదు బాధ్యతలు చూస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ శంషాబాద్ ఏయిర్‌పోర్టులో ప్రధాన కార్యదర్శులు, కోర్‌కమిటీతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు పార్టీ చేరికలపై రాష్ట్ర నాయకత్వానికి సూచనలు తెలియచేశారు. ఈనెల 16 నుంచి 18 వరకు విస్తారక్‌లు నియోజకవర్గాలకు వెళ్ళి విస్తృతంగా పర్యటించాలని ఆయన ఆదేశించారు. ఈ అంశాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వీటితో పాటు ఆకర్ష్‌లో భాగంగా బీజేపీలో చేరిన కొత్త నాయకులకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బాధ్యులతో పాటు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *