Breaking News
Home / Fashion / మిసెస్‌ ఇండియా తెలంగాణగా శోభాదేవి….

మిసెస్‌ ఇండియా తెలంగాణగా శోభాదేవి….

హైదరాబాద్‌: వైద్యవృత్తిలో రాణిస్తున్న 63 ఏళ్ల మహిళ ఫ్యాషన్‌ రంగంలో కూడా తన సత్తా చాటారు. హైదరాబాద్ లోని లైఫ్‌ స్పాన్‌ హాస్పిటల్స్‌లో డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ నక్కాన శోభాదేవి, మిసెస్‌ ఇండియా తెలంగాణ 2019 కిరీటాన్ని గెలుచుకున్నారు. లండన్‌లో వైద్యురాలిగా 20 సంవత్సరాలు పనిచేసిన శోభాదేవి, స్వదేశంలో సేవచేయాలనే ఉద్దేశంతో భారత్‌కు తిరిగి వచ్చారు. వైద్య రంగంలో పలు అవార్డులు పొందిన ఆమె, ఫ్యాషన్‌ రంగం మీద మక్కువతో పలు అందాల పోటీల్లో కూడా పాల్గొని విజయం సాధించారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ 2019 అందాల పోటీలో సూపర్‌ క్లాసిక్‌ విభాగంలో తాను విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్‌ శోభాదేవి తెలిపారు.

Check Also

ఏపీలో కరోనా కేసుల రికార్డు… ఒకేరోజు 210

Share this on WhatsAppఏపీలో కరోనా ఉదృతి తగ్గడం లేదు. రోజు యూ కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *