Breaking News
Home / National / అభిమానులకు షాక్.. ఈ ఐపీఎల్ వేలానికి కీలక వ్యక్తి దూరం

అభిమానులకు షాక్.. ఈ ఐపీఎల్ వేలానికి కీలక వ్యక్తి దూరం

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ కోసం ఈ నెల 18వ తేదీన జైపూర్‌లో వేలం జరుగనుంది. అయితే ఈసారి ఈ వేలం కోసం పెద్ద మొత్తంలో ధరఖాస్తులు వచ్చాయి. దాదాపు 1,003 మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొత్తం 232 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఓ వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంతకాలంగా ఐపీఎల్ వేలానికి వ్యాఖ్యాతగా ఉన్న రిచర్డ్ మాడ్లీ రానున్న సీజన్ వేలానికి దూరం కానున్నారు.

రిచర్డ్ మాడ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటివరకూ జరిగిన ప్రతీ ఐపీఎల్‌ సీజన్ ఆటగాళ్ల వేలానికి హోస్ట్‌గా రిచర్డ్ ఉన్నారు. ఆయన వేలం నిర్వహించే తీరు ఆహ్లాదంగా ఉండేది. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ వేలంలో రిచర్డ్ మాడ్లీ పాత్ర ఎంతో కీలకం. ఇలా ప్రతీ వేలంలో తనదైన ముద్ర వేసిన రిచర్డ్ హ్యామర్ మ్యాన్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే రానున్న ఐపీఎల్ వేలానికి రిచర్డ్ దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘‘ఐపీఎల్ 2019 వేలం నేను నిర్వహించడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా ఉండటం నాకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. భారతదేశంలో నా మిత్రలును, అభిమానులను నేను ఎంతో మిస్ అవుతాను. ప్రతీసారి మీరు నాకు అందించిన స్వాగతానికి ధన్యవాదాలు. ది హ్యామర్ మ్యాన్’’ అంటూ రిచర్డ్ ట్వీట్ చేశారు.

అయితే ఇది తాను తీసుకున్న నిర్ణయం కాదని.. బీసీసీఐ తనను ఈ వేలానికి ఆహ్వానించలేదని మరో ట్వీట్‌లో రిచర్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఐపీఎల్ వేలం నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు. ఈ వేలానికి హాజరుకావాలని బీసీసీఐ నన్ను ఆహ్వానించలేదు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే.. నన్ను డ్రాప్ చేశారు’’ అంటూ రిచర్డ్ మరో ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే రిచర్డ్‌ని తప్పించిన బీసీసీఐపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దిగ్గజాలను తప్పించడం బీసీసీఐకి అలవాటే అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘మీ కోసమే ఐపీఎల్ వేలాన్ని చూసే వాళ్లం.. ఇప్పుడు ఇక ఆ కార్యక్రమాన్ని చూడము’’ అని అంటున్నారు. మరి రిచర్డ్ స్థానంలో ఈసారి ఐపీఎల్ వేలానికి వ్యాఖ్యాతగా ఎవరిని నియమిస్తారో వేచి చూడాల్సిందే.

Check Also

ఐపీఎల్ వేలం.. రికార్డు ధర పలికిన ఇద్దరు యువ క్రికెటర్లు..

Share this on WhatsAppఒకరు రంజీ ట్రోఫీ హీరో.. మరోకరు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టిన క్రికెటర్.. దేశీయ క్రికెట్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *