Breaking News
Home / Lifestyle / Business / మొబైల్ వినియోగదారులకు షాక్…

మొబైల్ వినియోగదారులకు షాక్…

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో జియో ప్రవేశం తర్వాత టెలికాం స్వభావమే మారిపోయింది. ఉచిత కాల్స్, డేటాతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు కాల్స్‌కు, డేటాకు వేర్వేరుగా రీచార్జ్‌లు చేసుకునే వినియోగదారులకు ఆ అవకాశమే లేకుండా పోయింది. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే ఇక అన్నీ ఉచితమే అన్న జియో ప్లాన్లు వినియోగదారులను కట్టిపడేశాయి. ఫలితంగా అనతికాలంలోనే జియో అగ్రస్థానికి చేరుకుంది.

ఇక జియో రాకతో ఇతర టెలికాం కంపెనీలు కష్టాలు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ టెలికాం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించనుంది. అలాగే, ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనను కూడా చేయనున్నట్టు సమాచారం. కంపెనీల ఆదాయానికి గండికొట్టే ఇటువంటి వాటికి ఇక చెక్ పెట్టడం ద్వారా కంపెనీలను కష్టాల ఊబి నుంచి బయట పడేయవచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఫోన్‌ కాల్స్, డేటా సర్వీసులకు కనీస చార్జీలను ప్రకటించే అంశాన్ని ట్రాయ్ పరిశీలిస్తోంది.

ఇక కష్టాల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలు ప్రభుత్వం నుంచి కొన్ని ఉపశమన చర్యలు ఆశిస్తున్నాయి. అందులో మొదటిది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటాను తగ్గించాలని, స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల పాటు అంటే.. మార్చి 2022 వరకు మారటోరియం ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజును ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *