Breaking News
Home / Film News / సైరాకు షాక్.. కెనడాలో షోల నిలిపివేత

సైరాకు షాక్.. కెనడాలో షోల నిలిపివేత

టొరొంటో: గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు కెనడాలోని టొరొంటోలో బ్రేక్ పడింది. అక్కడ ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేశారు. ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సినిమా ప్రదర్శితమవుతున్న ల్యాండ్‌మార్క్ సినిమాస్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒక్కసారిగా కత్తి బయటకు తీసి తెరను చించేశాడు. అనంతరం ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే‌ను చిమ్మి పరారయ్యాడు. విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. రెండు ఘటనలు ఒంటారియో ప్రావిన్స్‌లోనే జరిగాయి. సినిమా తెలుగులో ప్రదర్శితమవుతుండడంతో కావాలనే ఇలా చేశారని సమాచారం. ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరిగాయి. ఓ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడమో, మరణించడమో జరిగిందని సమాచారం. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా షోలను నిలిపివేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *