Breaking News
Home / National / చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు…

చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు…

ముంబై: శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది పార్టీ అగ్రనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీజేపీలో చేరగా తాజాగా మరో అభ్యర్థి కూడా కమలం గూటికి చేరారు. బీడ్ జిల్లాలోని కైజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నమిత ముందాడ ఎన్సీపీ తరఫున పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఆమె పార్టీ మారడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, లోక్‌సభ ఎంపీ ప్రీతమ్ ముండే సమక్షంలో నమిత సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కైజ్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసిన నమిత బీజేపీ అభ్యర్థి సంగీత తాంబ్రే చేతిలో ఓటమిపాలైంది. మహారాష్ట్రలో అక్టోబర్ 21న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *