Breaking News
Home / National / వాషింగ్ మెషీన్‌లో పిల్లాడిని చూసి షాకైన తండ్రి….?

వాషింగ్ మెషీన్‌లో పిల్లాడిని చూసి షాకైన తండ్రి….?

కొన్ని సంఘటనలు నవ్వుకోవడానికి బాగుంటాయి. మరికొన్ని గుండె ఆగిపోయాలా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే దుస్తులు ఉతుకుతుంటే వాషింగ్ మెషీన్‌ లో పిల్లాడు కనిపిస్తే ఎలా ఉంటుంది, మేరె చెప్పండి. చాలా భయం వేస్తుంది కదా. ఇలాంటి సంగటన ఒకటి రష్యాకు చెందిన ఓ తండ్రికి కూడా ఇదే అనుభవం ఒకటి ఎదురైంది. వాషింగ్ మెషీన్‌ లో దుస్తులు ఉతుకుంతుండగా సడన్ గా అతడికి అందులో పసివాడు కనిపించాడు. అంతే అంతడితో అతడికి గుండె జారినంత పనైంది. వెంటనే వాషింగ్ మెషీన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఆ పసివాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు ఆయన.

కానీ, అతడికి అప్పుడు మరో షాక్ ఎదురైంది. ఎందుకంటే, ఆ వాషింగ్ మెషీన్‌ లో ఆ పసివాడు కనిపించలేదు. దీనితో అందులో ఉన్న దుస్తులన్నీ బయటకు తీసి చూశాడు. చివరికి అది తన కొడుకు టీషర్ట్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు ఆ తండ్రి. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అతడు వాషింగ్ మెషీన్‌ లో పసివాడిని చూడగానే గుండె ఆగినంత పనైంది, ”అది టీషర్ట్ అని తెలిసే సరికి ఊపిరి పీల్చుకున్నా అని చెప్పుకోచ్చాడు. ఈ ఫొటోను ఎవరైనా ఇప్పడినుంచి పోస్టు చేస్తే తప్పకుండా అది టీషర్ట్ అని చెప్పండి. లేకపోతే నాలాగే పొరపడితే వారి గుండె కూడా ఆగిపోతుంది” అని తెలిపాడు. ఈ పోస్టు చుసిన నెటిజనులు అతడికి వివిధ సలహాలు ఇస్తున్నారు.

ఇకపై టీషర్టులు ఉతికినప్పుడు నేరుగా కాకుండా లోపలి భాగాన్ని బయటకు వచ్చేలా తీసి ఉతకాలని, లేకపోతే అవి కలర్ పోతాయి. పైగా, ఇలాంటి గుండె ఆగే సందర్భాలు కూడా రావు. టీషర్టులపై ఉండే బొమ్మలు ఎక్కువ రోజు మన్నికతో ఉండాలంటే అదే మంచి పద్ధతి అంటూ వారి వాషింగ్ స్కిల్స్ ని నెటిజన్లు చెబుతున్నారు. మరికొందరైతే మీ ఇంట్లో టీషర్టులు నువ్వే గుర్తుపట్టకపోతే ఎలా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సందర్భంగా ఎదురుకాకుండా ఉండాలంటే పైన చెప్పినట్లు చేస్తే సరిపోతుంది కదా.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *