Breaking News
Home / Film News / షాకిచ్చిన రాహుల్, శ్రీముఖి….

షాకిచ్చిన రాహుల్, శ్రీముఖి….

సోషల్ మీడియా :తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘బిగ్ బాస్’ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన 17 మందిలో పోటాపోటీ చివరివరకు రాహుల్ మరియు శ్రీముఖి మధ్య నువ్వా నేనా అన్నట్టు గా సాగింది. గ్రాండ్ ఫినాలే రోజు ఇద్దరిలో ఎవరు టైటిల్ విన్నర్ గెలుస్తారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇటువంటి తరుణంలో రాహుల్ మరియు శ్రీముఖి మధ్య వివాదాలు చోటు చేసుకోవడం వల్ల హౌస్లో ఉన్న వాతావరణమే ప్రస్తుతం బయట కూడా కొనసాగుతుందని అందువల్ల అందరూ కలుస్తున్న గాని రాహుల్ మరియు శ్రీముఖి కలసి పార్టీ చేసుకున్న సందర్భాలు వాతావరణం ప్రస్తుతం కనపడటం లేదని సోషల్ మీడియాలో వీరిద్దరిపై వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అదే క్రమంలో ఓ షో కోసం రాహుల్ ఆ మధ్య శ్రీముఖికి ఫోన్ చేస్తే మాట్లాడలేదని మీడియా ముఖంగా రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీముఖి కూడా బిగ్ బాస్ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాహుల్ మీద అసహనాన్ని చాటింది.దీంతో వీరిద్దరి ఇంకా కలవరు అని అందరూ అనుకుంటున్న తరుణంలో సడెన్ గా వీరిద్దరూ మళ్లీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని ప్రకటించారు. దానికి సూచనగా ఓ సెల్ఫీని పోస్ట్ చేసి ఇద్దరి మధ్య గొడవలు అన్నవారికి బెంబేలెతే షాక్ ఇచ్చారు. దానికి ‘గతం గతః.. అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్- వితిక, రాహుల్ మరియు శ్రీ ముఖి కలిసి పార్టీ చేసి డాన్స్ చేసిన వీడియోను శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చింది. దీంతో రాహుల్ మరియు శ్రీముఖి అభిమానులు వీడియో చూసి ఫ్రెండ్షిప్ నెవర్ డైస్ అని కామెంట్లు పెడుతున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *