Breaking News
Home / hyderabad / ఆత్మరక్షణ కోసమే కాల్పులు: పోలీసులు

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: పోలీసులు

హైదరాబాద్: దిశ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు తగిలిన గాయాలపై ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం వైద్యులను అడిగి తెలుసుకుంది. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు బృందానికి వివరించారు. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో తమపై దాడిచేసి రివాల్వర్లు లాక్కున్నారన్నారు. కొంతదూరం వెళ్లాక నిందితులు కాల్పులకు తెగబడ్డారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌, సీసీ ఫుటేజీని పోలీస్ అధికారులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి ఇచ్చారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *