Breaking News
Home / National / టిక్‌టాక్ వీడియో చేస్తూ….

టిక్‌టాక్ వీడియో చేస్తూ….

ఒడిశా: టిక్‌టాక్ వీడియోల మోజు ఓ యువకుడి ప్రాణాల మీదుకు తీసుకొచ్చింది. బిల్డింగ్‌పై వీడియో తీస్తుండగా కాలు జారి పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని రూర్కేలాలో జరిగింది. రూర్కేలా సెక్టార్ సెవన్‌కి చెందిన 19ఏళ్ల అనిల్‌కు టిక్‌టాక్ అంటే చాలా ఇష్టం. ఆ అలవాటులో భాగంగానే వీడియో షూట్ చేయడానికి తన స్నేహితుడితో పాటు ఓ బిల్డింగ్ పైకి వెళ్లాడు. షూటింగ్‌లో ఉండగానే.. పైనుంచి కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్లు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *