Breaking News
Home / Crime / మహిళ ఫిర్యాదుతో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు…..

మహిళ ఫిర్యాదుతో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు…..

వెల్లూరు: ఓ మహిళ సెల్‌ఫోన్‌కు అసభ్యకర ఫొటోలు, వీడియోలు పంపించిన ట్రాఫిక్ పోలీసుపై సస్పెన్షన్ వేటుపడింది. అక్టోబర్ 25న సదరు మహిళ తనకు వీడియోలు పంపిన ఎస్‌ఐ రాజమాణిక్యం దగ్గరకు వెళ్లి అతన్ని హెచ్చరించింది. దీంతో తనను క్షమించాలని ఎస్‌ఐ రాజమాణిక్యం ఆ మహిళను వేడుకున్నాడు. ఎస్‌ఐ క్షమాపణలు చెబుతుండగా మహిళ తీసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. మహిళ ఫిర్యాదుతో ఆ ఎస్‌ఐను సస్పెండ్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ బాలకృష్ణన్ తెలిపారు. ఎస్‌ఐ రాజమాణిక్యం వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో మహిళ నంబర్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *