హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శ్రీనివాస్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలవడంతో మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఎస్సైను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
