Breaking News
Home / National / సిద్ధరామయ్య చేష్టలు విమర్శలకు దారి తీసాయి……..

సిద్ధరామయ్య చేష్టలు విమర్శలకు దారి తీసాయి……..

బెంగుళూరు: దావణగెరె ఇందిరా క్యాంటిన్‌ ప్రారంభోత్సవంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేష్టలు విమర్శలకు దారి తీసాయి. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరులోని హరిహరలో ఇందిరా క్యాంటిన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైనారు. ఆ సమయంలో ఇందిరా క్యాంటిన్‌ ప్రారంభించిన తరువాత కర్ణాటక నాడ గీతం (కర్ణాటక గీతం) ఆలపించారు. ఈ సందర్భంగా అదే వేదిక మీద మాజీ సిఎం సిద్ధరామయ్య ఉన్నారు. కన్నడ నాడ గీతం ఆలపిస్తున్న సమయంలో సిద్ధరామయ్య కాళ్లు చేతులు ఆడిస్తూ నోటిలో ఏదో పదార్థాలను బయటకు ఉమ్ముతూ కనిపించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వేదిక మీద ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, ఆ కార్యక్రమానికి హాజరైప ప్రజలు సిద్ధరామయ్య తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన చేష్టలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. సిద్ధరామయ్య నాడ గీతంను అవమానించారని బిజెపి నాయకులతో పాటు పలు పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇందిరా క్యాంటిన్‌ ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడే పలావ్‌ ఆరగించారు. ఇందిరా క్యాంటిన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎస్‌.మల్లికార్జున్‌, మాజీ మంత్రులు తదితరులు హాజరైనారు. ఇంత జరిగినా సిద్ధరామయ్య ఈ విషయంలో వివరణ ఇవ్వడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు. బిజెపి వారికి విమర్శించేందుకు మంచి అస్త్రం దొరికినట్లయింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *