అమరావతి: టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసు విషయమై వర్ల రామయ్య ఆరోపణలు గుప్పించారు. దీనిపై సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. వర్ల రామయ్య చేసిన ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు చూపించాలని సిట్ ఆదేశించింది.
