Breaking News
Home / States / నాకు ఇప్పటి వరకు పిలుపు రాలేదు:కేకే

నాకు ఇప్పటి వరకు పిలుపు రాలేదు:కేకే

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌లో తెరాస ముఖ్యనేత కేశవరావు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలతో సంప్రదింపుల విషయమై సీఎం కేసీఆర్ నన్ను ఇప్పటి వరకు పిలవలేదని అన్నారు. ఆర్టీసీ ఐకాస నేతలెవ్వరూ తనను కలవలేదని, ఒక వేళ సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిగా ఉంటానని కేకే తెలిపారు. ఇద్దరు కార్మికులు చనిపోయారనే బాధతోనే ‘ చర్చలకు సిద్ధం కావాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చానన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేవలం ఒక సీనియర్ నాయకుడిగా మాత్రమే స్పందించానని, కార్మికుల సమస్యలు గురించి పునరలోచించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కేకే వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయనే ఉద్దేశంతోనే స్పందించినట్లు కేకే స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *