Breaking News
Home / Film News / శివకార్తికేయన్‌ తాజా చిత్రం టీజర్ విడుదల….

శివకార్తికేయన్‌ తాజా చిత్రం టీజర్ విడుదల….

చెన్నై: నటుడు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘హీరో’. ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహిస్తుండగా కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అభయ్‌ డియోల్‌, అర్జున్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. కార్పొరేట్‌ కళాశాలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అంశాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. ‘ఈ వ్యవస్థను మార్చడానికి సాధారణ మనిషి సరిపోడు. ఒక హీరో కావాలి’ అంటూ అర్జున్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *