Breaking News
Home / National / లలితా జువెలరీ దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు

లలితా జువెలరీ దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు

ఆరుగురు జార్ఖండ్‌ యువకుల అరెస్టు
చెన్నై: లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ కేసులో తిరుచ్చి పోలీసులు జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. బుధవారం వేకువజామున తిరుచ్చి సత్రం బస్‌స్టేషన్‌ సమీపంలోని లలితా జువెలరీ షోరూం గోడకు కన్నంవేసి లోపలకు ప్రవేశించిన దోపిడీ దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. దొంగలను పట్టుకునేందుకు తిరుచ్చి పోలీసులు ఏడు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో పుదుకోటలోని ఓ లాడ్జిలో జార్ఖండ్‌ యువకులు బస చేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోజనాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి వస్తున్న మరో యువకుడు పోలీసులను చూసి గోడదూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలతో దొరికిపోయిన అత డిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మిగిలినవారిని విచారిస్తున్నారు.

ఆరు బ్యాగులు స్వాధీనం..
పుదుకోట లాడ్జిలో అరెస్టయిన ఆరుగురి నుంచి ఆరు ప్లాస్టిక్‌ బ్యాగు లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి లలితా జువెలరీలో దొంగలు ఉపయోగించిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బ్యాగుల్లా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారివద్ద ఖాళీ బ్యాగులు ఎందుకున్నాయో తెలుసునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ గదిలో వెల్డింగ్‌ మిషన్‌ కొనుగోలుకు సంబంధించిన బిల్లు కూడా దొరికింది. ఈ ఆరుగురు కోయంబత్తూరులో బ్యాంక్‌ దోపిడీకి పథకం వేసుకున్నారని విచారణలో వెల్లడైంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *